Kavitha Health : కవిత హెల్త్ బులెటిన్.. డాక్టర్లు ఏమన్నారంటే?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలు కవిత ( Kavitha ) తిహార్ జైలులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జైలు సిబ్బంది ఉన్న తాధికారులకు సమాచారం అందించగా, ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యచికిత్స చేయించండని ఆదేశించారు. దీంతో సమీపంలోని దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించి కవితకు చికిత్స అందించారు.
ఫీవర్ తో బాధపడుతున్న కవితకు చికిత్స అందించిన తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. కేటీఆర్ ఢిల్లీకెళ్లి కవితను పరామర్శించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పలుమార్లు విచారణ జరిగిన ఈడీ.. మార్చి 15న కవితను అదుపులోకి తీసుకుంది. మార్చి 26 నుంచి జుడీయల్ ఖైదీగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం కవిత.. పలుమార్లు పిటిషన్లు దాఖలు చేయగా రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించగా.. అటు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com