BRS Party : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్

కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బిగ్ షాకిచ్చింది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గాంధీలపై రిట్ పిటిషన్ వేసింది.
ఈ కేసుపై హరీశ్ రావు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. దీంతో విచారణపై ఉత్కంఠ నెలుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని.. దీన్ని పరిగణనలోకి తీసుకుని స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com