Addanki Dayakar : బీఆర్ఎస్‌కో న్యాయం? కాంగ్రెస్‌కో న్యాయమా? : అద్దంకి దయాకర్

Addanki Dayakar : బీఆర్ఎస్‌కో న్యాయం? కాంగ్రెస్‌కో న్యాయమా? : అద్దంకి దయాకర్
X

బీఆర్ఎస్ నేతలను తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్​లో చేర్చుకుంటున్నట్లు ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారుతున్న వారిని ఆపే ప్రయత్నం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను చూస్తుంటే నవ్వొస్తుందని సెటైర్ వేశారు. పార్టీ ఫిరాయింపులు కేవలం తెలంగాణలోనే జరగడం లేదని..దేశ రాజకీయాల్లో ఒక తంతుగా మారిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్​లో టీడీఎల్పీ, సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు.. కేటీఆర్​కు చట్టం, న్యాయం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో బీఆర్ఎస్‌కో న్యాయం? కాంగ్రెస్‌కో న్యాయమా? అని నిలదీశారు. చట్టపరమైన అంశాలను కాంగ్రెస్‌ దీటుగా ఎదుర్కొంటుందని చెప్పారు.

Tags

Next Story