BRS: బీఆర్‌ఎస్ ప్రచార హోరు

తెలంగాణలో శాసనసభ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాల జోరు హోరెత్తుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండంతో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచార రథాలతో పల్లే, పట్నం తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ది వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తూ కారును విజయతీరాలకు చేర్చాలని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ హైదరాబాద్‌లో అధికార పార్టీ నాయకులు ప్రచారాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. కాలే యాదయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్లో పద్మారావు ఇంటింటికి తిరుగుతూ బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బండిమెట్, ఆదయ్యనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. హబ్సిగూడలోని పలు కాలనీల్లో ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దానం నాగేందర్ హిమాయత్ నగర్ డివిజన్‌లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ MLA అభ్యర్థి ముఠాగోపాల్ గంగపుత్ర కాలనీలో ప్రచారం చేశారు. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి లాస్య నందిత గెలుపు కోసం కృషి చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గం, చంపాపేట్ డివిజన్ లోని పలు కాలనీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోదరుడు రణధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నంద కిషోర్ వ్యాస్ బిలాల్.. బేగంబజార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. శేరిలింగంపల్లి అభ్యర్థి అరికెపూడి గాంధీ.. ఆల్విన్ కాలనీ డివిజన్ లో పలు కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్వాన్ నియోజకవర్గ భారాస అభ్యర్థి మిత్ర కృష్ణ భాంజావాడి, డోర్ బస్తి, వడ్డెర బస్తిలో ప్రచారం చేశారు. రామయంపేట మున్సిపాలిటీలోని పలువార్డులలో మెదక్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఆలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని తండాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనకల్ మండలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ఇంటింటికి తిరుగుతూ.. ఎన్నికల ప్రచారం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com