BRS : బడ్జెట్ సమావేశాలపై 'గులాబీ' వ్యూహాలు.. ఫలిస్తాయా..?

BRS : బడ్జెట్ సమావేశాలపై గులాబీ వ్యూహాలు.. ఫలిస్తాయా..?
X

తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు వేలైంది. ఈ నెల 16 నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ మీద పైచేయి సాధించాలని.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ ఎస్ భావిస్తోంది. అందులో భాగంగా ఈ సారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. నేడు గండిపేటలోని గోల్కొండ రిసార్టులో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. మాజీ మంత్రి హరీష్‌ రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలు, అడగాల్సిన ప్రశ్నలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సమావేశాల్లో పార్టీ లైన్ ఏంటనేదానిపై వారికి వివరించారు.

ఈ సారి ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై పట్టుబట్టాలని బీఆర్ ఎస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అలాగే గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులపై కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అటు మూసీ నది ప్రక్షాళన, వెలుగుమట్ల ఇష్యూతో పాటు జాబ్ క్యాలెండర్, గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు, ఇతర అంశాలపై గట్టిగా ప్రశ్నించాలని డిసైడ్ అయింది. ఈ సారి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెట్టాలని బీఆర్ ఎస్ చూస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు కూడా వెళ్లాయి.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని గతంలో రాహుల్ గాంధీ ప్రకటించారు కాబట్టి.. ఆ మేరకు తామే ప్రైవేట్ బిల్లు పెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు గులాబీ నేతలు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విధి విధానాలను రెడీ చేస్తున్నారు. అతి త్వరలోనే కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం కూడా ఉండబోతోంది. బీఆర్ ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది.


Tags

Next Story