Mukharake Villagers Invitation : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రండి.. ముఖరాకే గ్రామస్తుల సంచలన ఆహ్వానం

ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ముఖరాకే గ్రామస్తులు వినూత్నంగా ఆహ్వనం పలుకుతున్నారు. పెండ్లి పత్రిక తరహాలో ఆహ్వానపత్రికను ఇంటింటికీ బొట్టు పెట్టి మరీ అందించి ఆహ్వానిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా(కే) గ్రామస్తులు ఏది చేసినా ప్రత్యేకంగా చేస్తారు. పచ్చదనం పరిశుభ్రత, పన్నుల చెల్లింపు ఇలా అనేక విషయాల్లో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా వారు చేస్తున్న ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తప్పకుండ రావాలని ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడుతూ, బట్టలు పంచుతూ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రికను మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 27న 25 ఏళ్ల గులాబీ పండుగకు ప్రతి ఒక్కరు వచ్చి సభను విజయ వంతం చెయ్యాలన్నారు. తెలంగాణ ప్రజల కోసం పాటు పడేది బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ వస్తేనే మళ్లీ తెలంగాణ బాగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com