BRS MLAs :నిరసన టీ షర్ట్స్ తో అసెంబ్లీకి బీఆర్ఎస్.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

BRS MLAs :నిరసన టీ షర్ట్స్ తో అసెంబ్లీకి బీఆర్ఎస్.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
X

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసన కోసం ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అడ్డుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, అదానీ భాయ్‌ భాయ్‌ అన్న టీషర్ట్స్‌ వేసుకున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలను గేటు వద్దే అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. లోపలికి అనుమతించకపోవడంతో భద్రతా సిబ్బంది, బీఆర్‌ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసెంబ్లీ ఎదుట గన్‌పార్క్‌ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరస తెలిపారు. అదానీ రేవంత్ దోస్తీ పై బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. అదానీ రేవంత్ భాయి భాయి అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఢిల్లీలో అదానీతో కుస్తీ.. గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదన్నారు. తమకు టీషర్ట్‌లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారని కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు చేశారు. రేవంత్ సర్కారు బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు వినిపించారు.

Tags

Next Story