GHMC Meeting : BRS vs congress జీహెచ్ఎంసీ మీటింగ్లో రసాభాస

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. ఇవాళ సమావేశం ప్రారంభం కాగానే మేయర్ గద్వాల విజయ లక్ష్మి రూ.8 వేల440 కోట్లతో 2025 2026 సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రద ర్శించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమ లుకావడం లేదంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకొని బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేతుల్లోంచి ప్లకార్డులు లాక్కొని చించేశారు. ఆరు గ్యారెంటీల అమలు, అభి వృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చకు పట్టు బట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో మేయర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గందరగోళం మధ్య చర్చలేకుండానే బడ్జెట్ కు ఆమోదం లభించింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సభ వాయిదా పడింది. రూల్ బుక్ లోని సెక్షన్ 89/1 ప్రకారం సభను అడ్డుకున్న బీఆర్ఎస్ సభ్యులను మేయర్ సస్పెండ్ చేయగా.. మార్ష ల్స్ వారిని బయటికి పంపించారు. అనంతరం ప్రారంభమైన క్వశ్చన్ హవర్ ను కొందరు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. బయటకి తీసుకెళ్లిన తమ కార్పొరేటర్లను హౌజ్ లోకి తీసుకురావాలన్నారు. తనపై వాళ్లు పేపర్లు విసిరారని మేయర్ ఫైర్ అయ్యారు. మేయర్ కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. మేయర్ తమకు క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదంటూ బీఆర్ఎస్ కా ర్పొరేటర్లు కార్యాలయం బయట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com