భూ కుంభకోణం అంటున్న బీఆర్ ఎస్.. కొత్త రచ్చ

ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్ మేషన్ పాలసీపై బీఆర్ ఎ స్ గురి పెట్టింది. తెలంగాణలో భారీ భూ కుంభకోణం జరుగుతోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ టీమ్ రూ.5లక్షల విలువ చేసే భూములను కొట్టేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. బాలానగర్, కాటేదా, జీడిమెట్లలో తనవాళ్లకు సీఎం రేవంత్ భూములిచ్చారని.. జపాన్ లో ఉన్పప్పుడు కూడా ఈ భూములపై ఆర్డర్లు ఇచ్చారని ఆరోపించారు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డికే భూములు అప్పజెప్పాలని కుంభకోణానికి తెర తీశారంటున్నారు కేటీఆర్. ఈ విషయంపై పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నామన్నారు.
బీఆర్ ఎ స్ టైమ్ లో భూములకు వందశాతం ఫీజు కట్టేలా నిబంధనలు తెచ్చామన్నారు. వాటిని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి 30 శాతం కడితే రెగ్యులర్ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు కేటీఆర్. పారిశ్రామిక వేత్తలు రేవంత్ ట్రాప్ లో పడొద్దన్నారు. కేటీఆర్ ఆరోపణలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం 30 శాతం, 50 శాతం ఫీజులు వసూలు చేయాలని నిర్ణయిస్తే రూ.5లక్షల కోట్ల స్కామ్ అనడం దుర్మార్గం అన్నారు శ్రీధర్ బాబు.
గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వమే పరిశ్రమలకు లీజుకు ఇచ్చిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించిందన్నారు. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేశారో చెప్పాలన్నారు శ్రీధర్ బాబు. కేటీఆర్ చెబుతున్న 9300 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ఫ్లాటింగ్ చేసింది 4700 ఎకరాలే అన్నారు. మిగిలిన భూమిని రోడ్లు, డ్రైనేజీల లాంటి మౌళిక సదుపాయాల కోసం వాడామన్నారు శ్రీధర్ బాబు. ఇలా బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య భూ కుంభకోణంపై కొత్త రచ్చ జరుగుతోంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల వేళ దీన్ని హైలెట్ చేయాలా వద్దా అనేదానిపై బీఆర్ ఎస్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి రచ్చ మున్ముందు జరుగుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

