KTR: ఏ కొడుక్కు దమ్ముందో చూస్తా:కేటీఆర్

KTR: ఏ కొడుక్కు దమ్ముందో చూస్తా:కేటీఆర్
హైడ్రా చుట్టూ తిరుగుతున్న రాజకీయం... హైడ్రాకు సవాల్ విసిరిన ఎంఐఎం

తెలంగాణలో హైడ్రా రాజకీయం ఆసక్తికరంగా మారింది. పేదవాళ్ల ఇళ్లను కూల్చి, పెద్దవాళ్లకు నోటీసులిస్తున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మూసీలో చేసిన RD-X మార్కింగ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారులు సర్వే చేసి వాటికి గుర్తులు వేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘వాటిని చెరిపేసి కేసీఆర్ అని రాయండి.. ఎవడు అడుగుతాడో, ఏ కొడుక్కు దమ్ముందో నేను చూస్తా’ అని అన్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మార్కింగ్ ప్రక్రియ, ఇళ్ల హద్దుల ఖరారుతో స్థానికులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. దాదాపు 45 కిలోమీటర్ల పొడవునా హద్దులను నిర్దేశిస్తున్నారు. మరోవైపు జంట జలాశయాలు గేట్లు కూడా ఎత్తడంతో మూసీకి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వరద పెరగడంతో స్థానికులు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు.


హైడ్రాకు ఎంఐఎం సవాల్‌

‘హైడ్రా హటావో.. ఘర్‌ బచావో’ నినాదం పాతబస్తీలో మార్మోగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రాకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోకి బుల్డోజర్లు వచ్చే దమ్ముందా.. వస్తే తామేంటో చూపిస్తామని బహదూర్‌పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌ సవాల్ విసిరారు. ప్రభుత్వం మొండిగా ఇళ్లను కూల్చడానికి యత్నిస్తే బుల్డోజర్ల ముందు తాము నిలబడతామని స్పష్టం చేశారు.

హరీశ్ వ్యాఖ్యలతో పెరిగిన బీఆర్‌‌ఎస్ గ్రాఫ్..?

సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్స్‌పై బీఆర్‌‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళలను గౌరవించడం మన బాధ్యత అని వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించేది బీఆర్ఎస్ అయినా వ్యక్తిగతంగా ఉపేక్షించబోనని హరీశ్ అన్నారు. హరీశ్ వ్యాఖ్యలపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. గులాబీ పార్టీకి మద్ధతుగా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

Tags

Next Story