Minister Ponnam : బీఆర్ఎస్..బీజేపీకి బీటీమ్..ఈ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ : మంత్రి పొన్నం

Minister Ponnam : బీఆర్ఎస్..బీజేపీకి బీటీమ్..ఈ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ : మంత్రి పొన్నం
X

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినందుకు మాజీ మంత్రి హరీశ్ రావు హ్యాపీగా ఉన్నారా..? బీజేపీ గెలిచిందని సంతో షపడుతున్నారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. తాము మొదటి నుంచి చెప్పిన్న ట్లుగానే.. బీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నాయన్నారు. 'టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరు మార్చారు. మహారాష్ట్ర కు వందల కార్లలో వెళ్లి కనీసం పోటీ కూడా చేయలేకపోయారు. మహారాష్ట్ర ఎన్నికలతో ఆ పార్టీల చీకటి ఒప్పందం బయటపడింది. ఈ ఎన్నికలతో మరోసారి నిరూపణ అయింది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. ప్రతిదీ రాజకీ యంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం. మొన్నటి వరకు పంట మొత్తం కాళేశ్వరం వల్లే అన్నారు. కాళేశ్వరం లేకున్నా ఎల్లంపల్లి నుంచి పొదుపుగా నీరు వాడుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాని పంట ఇప్పుడు వచ్చింది.. ప్రకృతి సహకరించింది. రూ.20 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని రైస్ మిల్లర్లకు చెప్పాం. ఇంకా ఎవరైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి బకాయిలు చెల్లించాలి.

ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం అయినందుకు కల్లాల వద్దకు వచ్చి ప్రతిపక్ష నాయకులు ఇష్టారీతిన మాట్లాడారు. సన్న వడ్లకి రూ.500 బోనస్ ఇస్తున్నాం.. రాష్ట్రంలో ఎవరికైనా రాకపోతే చెప్పాలి. మాట మీద నిలబడి రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేశాం. ఎవరికైనా రుణమాఫీ కాకపోతే వ్యవసాయ అధికారుల ద్వారా కుటుంబ నిర్ధారణ జరుగుతోంది. ప్రభు త్వం సమాచారం సేకరిస్తుంది. వారికి కూడా తప్పకుండా రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభు త్వానిదే. ప్రజా పాలనలో మంత్రులు, ఎమ్మెల్యే లను ప్రజలు స్వేచ్ఛగా కలవగలుగుతున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చూస్తే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. అయినా ఆర్థిక క్రమశి క్షణ పాటిస్తూ ఒక్కో హామీని నెరవేరుస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఒకటో తేదీనే జీతాలు వస్తున్నాయి. 11 నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. గత పదేండ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలు గమనించా లి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తం. త్వరలోనే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తుంది 'అని మంత్రి పొన్నం అన్నారు

Tags

Next Story