Bandi Sanjay : కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించండి: బండి సంజయ్

Bandi Sanjay : కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించండి: బండి సంజయ్
X

TTD ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. 2023 మే 31న 10 ఎకరాల విస్తీర్ణంలో భూమి పూజ చేసినప్పటికీ పనులు జరగలేదని తెలిపారు. ఆలయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో పద్మనగర్‌లో పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని పేర్కొన్నారు. 2023 మే 31న రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధుల సమక్షంలో భూమి పూజ కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. కానీ దురదృష్టవశాత్తు ఆలయ నిర్మాణంలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కరీంనగరే కాదు చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా ఈ ఆలయ నిర్మాణం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని వివరించారు.

Tags

Next Story