TG : బల్కంపేట ఎల్లమ్మ కొత్త సంప్రదాయం వివాదం.. తలసాని హాట్ కామెంట్స్

కొత్త సాంప్రదాయాలకు తెరతీసి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను పద్మశాలి సం ఘం జయరాజ్ ఆధ్వర్యంలో మగ్గంపై తయారు చేసే పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వస్త్రాల తయారీకి ముందుకొచ్చిన వారిని ఆయన అభినందించారు.
ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని, పోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణంలో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లను, దాతలకు ఇచ్చే పాస్లను తగ్గిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులను ఈ విషయమై ప్రశ్నించారు. కొత్త విధానాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, పాత పద్దతులనే అవలంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ. కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ విషయమై నీతా అంబానికి తలసాని కృతజ్ఞతలు తెలిపారు. ఆ నిధు లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో అన్నదానం నిర్వహించాలని ఆలయ అధికారులకు సూచించారు. అమ్మవారికి బంగారు బోనం బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారికి జులై 2 వ తేదీన పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com