TG : ఎస్సీ వర్గీకరణపై కేబినెట్‌లో డివైడ్ టాక్.. ఉపకులాల రిజర్వేషన్లు ఇవే

తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన, ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై ప్రజాభిప్రాయం మేరకు సముచిత నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో ఎస్సీ వర్గీకరణ నివేదిక అంశంపై చర్చ సందర్భంగా మంత్రుల మధ్య విబేధాలు బయటపడినట్టు సమాచారం. ఒకే సామాజిక వర్గంలోని ఉపకులాలకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్వల్ప వివాదాలు మినహా కీలక నిర్ణయాలకు ఏకాభిప్రాయంతో కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు ప్రభుత్వ లక్ష్యాలను వెల్లడించారు. దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు.
మంత్రివర్గ భేటీలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో వేసిన ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపింది. గ్రూప్ 1 - ఎస్సీల్లో అత్యంత వెనుక బడిన కులాలు సంచార కులాలకు 1శాతం రిజర్వేషన్, గ్రూప్ 2 - మాదిగ, మాదిగ ఉప కులాలకు 9శాతం రిజర్వేషన్, గ్రూప్ 3 -మాల మాల ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఆయా వివరాలను కేబినెట్ సుదీర్గంగా చర్చించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com