TG : అసెంబ్లీ సెషన్ తర్వాతే కేబినెట్ విస్తరణ : మహేశ్ కుమార్ గౌడ్

కులగణన ఆధారంగానే త్వ రలోనే జరిగే లోకల్బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్డ్ తెలిపారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. దేశచ రిత్రలో ఎక్కడాలేని విధంగా కాంగ్రెస్అధికా రంలో వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన చేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని కోసం పనిచేస్తుంద న్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాతే కాబినేట్ విస్తరణ ఉంటుందన్నారు. పదినెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ' తెలంగాణ తల్లిని విమర్శిం చడం అంటే తెలంగాణను విమర్శంచడమే అవుతుంది. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారనే దిల్ రాజ్ కు కార్పొరేషన్ పదవి ఇచ్చాం. ఉద్యమ కారులను కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకొని గౌరవి స్తుంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికి న్యాయం జరగలేదు. ఈ విషయం ప్రజలకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆ ర్ఎస్కు గుండు సున్నా ఇచ్చారు. అయిన ప్పటికీ వారికి అహంకారం తగ్గడం లేదు. పతిపక్ష పాత్రలో ఉండి గౌరవంగా వ్యవహ రిస్తూ.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని అడుగుతున్నం. వాళ్లు మాపై ఫేక్ ప్రచారాలు చేయడం.. ప్రభుత్వాన్ని బద్నాం కి కంకణం కట్టుకున్నారు. మేం అభివృద్ధి చేస్తే.. వాళ్లు అడ్డువస్తుండ్రు' అని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com