హైదరాబాద్ నగరంలో బెంజ్ కారు బీభత్సం

హైదరాబాద్ నగరంలోని బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఓ ఇండికా కారును ఢీ కొంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు నుండి అతివేగంగా వచ్చిన బెంజ్ కార్.. ఇండికా క్యాబ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇండికా క్యాబ్‌లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ పబ్‌లో పీకలదాకా తాగి రోడ్డు పైకి వచ్చిన మందుబాబులు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారులో ముగ్గురు యువకులు, ఓ అమ్మాయి ఉన్నారు. సమాచారం అందిన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని కారు నడిపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 3 వద్ద ఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ డేంజర్ స్పాట్‌గా మారిందని.. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని.. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com