Kaushik Reddy : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు అడిషనల్ ఎస్పీ రవి చందన్. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 132,351 (3) BNS యాక్ట్ ప్రకారం కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు.
మరోవైపు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర పోలీసులు, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారిని అరెస్ట్ చేసిన పోలసులు రాత్రి రెండు మూడు గంటల పాటు వాహనాల్లో తిప్పుతూ..కొందరిని కేశంపేట పోలస్ స్టేషన్, మరికొందరిని తలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మాజీ మంత్రి హరీష్‌రావు బృందాన్ని అర్థరాత్రి కేశంపేట పోలీస్ స్టేషన్‌నుండి విడుదల చేశారు పోలీసులు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. కొందరు బీఆర్‌ఎస్ నేతలను హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరికొందరిని లకొండపల్లి పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతలను వాహనాలలో తరలిస్తున్న సమయంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com