Danam Nagender : ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై కేసు నమోదు

Danam Nagender : ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై కేసు నమోదు
X

ప్రభుత్వ స్థలం వ్యవహారంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.69 నందగిరిహిల్స్‌లో GHMC స్థల ప్రహరీని కొందరు కూల్చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. కూల్చివేతతో MLAకు సంబంధం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేత వల్ల రూ.10లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాపయ్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దానం నాగేందర్‌తోపాటు మరికొందరిపై ఐపీసీ, పీడీపీపీ చట్టంలోని 189 (3), 329 (3), 324 (4), రెడ్‌విత్‌ 190, సెక్షన్‌ 3 ఆఫ్‌ పీడీపీపీ యాక్ట్‌ కింద కేసు నమోదైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఘటనా స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని, బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లను ప్రోత్స హించి ఈ కూలి్చవేతలు చేపట్టినట్లు తెలిపారు.

Tags

Next Story