Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు
మంత్రి కొండా సురేఖపై కేసు నమోదైంది. CC నెంబర్ 490/2024, 336BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అలాగే మంత్రి కొండాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టును నాగార్జున ఆశ్రయించారు. క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొసిజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. నాగార్జున స్టేట్‌మెంట్ తర్వాత సాక్షుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com