Minister Tummala : రేపటి నుంచి వారి ఖాతాల్లో రూ.10 వేలు : మంత్రి తుమ్మల
రేపటి నుంచి ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో రూ.10వేల నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదన్నారు. వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని పది బృందాలు రంగంలోకి దిగి ఇంటింటి సర్వే చేస్తున్నాయని పేర్కొన్నారు. కాగా ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5లక్షల సాయం చేస్తామని ప్రకటించారు. పాడి పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేలు ఇస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందజేస్తామన్నారు. వరద బాధితులకు సైతం రూ.10 చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com