Rahul Gandhi : తెలంగాణలో కులగణన పూర్తి : రాహుల్ గాంధీ

Rahul Gandhi : తెలంగాణలో కులగణన పూర్తి : రాహుల్ గాంధీ
X

కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, వారికి అండగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలో ఉన్న తెలంగాణలో కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రిజర్వేషన్లలో ఓబీ సీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు, ఓబీసీలకు న్యాయం జరిగేలా పోరాడుతామని అన్నారు. ఇవాళ ఇండోర్ లో నిర్వహించిన జై బాపు, జై భీం, జై సంవిధాన్ ర్యాలీ లో ఆయన మా ట్లాడుతూ.. మోదీ సర్కారుకు వ్యాపారులే ముఖ్యమని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు.

స్వాతంత్రోద్యమాన్ని అవమాన పర్చేలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అమిత్ షా సాక్షాత్తూ పార్లమెంటులోనే అంబేద్కర్ ను అవమాన పర్చారని అన్నారు. దేశంలో 90% మందికి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదని, జనాభా దామాషా పద్ధతిలో రిజర్వే షన్లు అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని రాహుల్ గాంధీ చెప్పారు. రిజ ర్వేషన్లలో ముఖ్యంగా ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించిం దని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో ప్రజలను లూఠీ చేస్తోందని అన్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ చెప్పారు.

ఇది ఎన్నికల సభ కాదు యుద్ధం : సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు తామంతా రాహుల్ గాంధీ వెన్నంటి పోరాడుతు న్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఒక యు ద్దమని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజ్యాంగాన్నిమా ర్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ పరిణామాన్ని గ్రహించే పోరాడుతున్నారని చెప్పారు. గజనీ మహమ్మద్ హిందుస్థాన్ ను దో చుకునేందుకు యత్నించినట్టు మోదీ రాజ్యాగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పేరుతో కొనసాగుతున్న బ్రిటీష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ పో రాడుతున్నారని చెప్పారు. ఇది గాంధీ పరివార్, గాడ్సే పరివార్ ల మధ్య సాగు తున్న యుద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు.

Tags

Next Story