TG : తెలంగాణలో కుల గణన.. గ్రామాల్లో పెరిగిన హడావుడి

సమగ్ర, సామాజిక, ఆర్థిక, కులగణనకు తెలంగాణ సర్కారు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కులాల వారీగా జనాభాను లెక్కించడం మాత్రమే కాదు.. త్వరలో చేష్టనున్న జనగణన కార్యక్రమాన్ని బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు అర్హుల ఎంపిక, హెల్త్ ప్రొఫైల్ డాటా సేకరణ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మహిళలకు రూ.రెండున్నర వేల ఆర్థిక భృతి తదితర కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కులగణన రోడ్ మ్యాపు రూపొందించారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం కలెక్టర్లు తమతమ జిల్లాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఏడు కీలక విభాగాల అధికారుల సంయుక్త భాగస్వామ్యంతో సమగ్ర కులగణన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అందుకుగానూ సుమారు 85 వేల పైచిలుకు అధికారు లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా మెగా హెల్త్ చెకప్ లో ఉపయోగపడేలా ఈ కార్యక్రమం ద్వారా పూర్తిస్థాయి సమాచార సేకరణ చేయనున్నారు. సమగ్ర ప్రభుత్వాదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కులగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటింటి కుటంబ సర్వేకోసం అవసరమైన వనరులను, రికార్డులను గ్రామాలకు పంపించారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడంతో త్వరలో జరగనున్న సమగ్ర కుల గణనలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వా ములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈ సర్వే, మెగా హెల్త్ చెకప్ ఉపయోగ పడుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com