CBN: "ఇక్కడ ఉన్నది చంద్రబాబు జాగ్రత్త"

CBN: ఇక్కడ ఉన్నది చంద్రబాబు జాగ్రత్త
X
రౌడీయిజాన్ని సహించేదే లేదన్న ముఖ్యమంత్రి... సూపర్ సిక్స్ ను సమర్థంగా అమలు చేశాం.. త్వరలో 700 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం: సీఎం

తె­లు­గు­వా­రి ఆత్మ­గౌ­ర­వా­న్ని కా­పా­డ­టం, వారి రా­జ­కీయ స్వా­భి­మా­నా­న్ని జా­తి­కి గు­ర్తిం­పు­గా ని­ల­బె­ట్ట­డ­మే లక్ష్యం­గా స్వ­ర్గీయ నం­ద­మూ­రి తారక రా­మా­రా­వు తె­లు­గు­దే­శం పా­ర్టీ­ని స్థా­పిం­చా­ర­ని ము­ఖ్య­మం­త్రి, తె­లు­గు­దే­శం పా­ర్టీ అధి­నేత నారా చం­ద్ర­బా­బు నా­యు­డు స్ప­ష్టం చే­శా­రు. ఒక­ప్పు­డు తె­లు­గు­వా­రి­ని ‘మద­రా­సి’ అంటూ అవ­హే­ళన చే­సిన పరి­స్థి­తు­ల్లో, “తె­లు­గు­జా­తి అనే ఓ ప్ర­త్యేక అస్తి­త్వం ఉంది” అని దే­శా­ని­కి గర్వం­గా చా­టి­చె­ప్పిన నా­య­కు­డు ఎన్టీ­ఆ­ర్‌ అని ఆయన గు­ర్తు చే­శా­రు.

ఎన్టీ­ఆ­ర్‌ వర్ధం­తి సం­ద­ర్భం­గా తె­లు­గు­దే­శం పా­ర్టీ కేం­ద్ర కా­ర్యా­ల­యం­లో ఏర్పా­టు చే­సిన కా­ర్య­క్ర­మం­లో సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు పా­ల్గొ­న్నా­రు. ముం­దు­గా ఎన్టీ­ఆ­ర్‌ వి­గ్ర­హా­ని­కి పూ­ల­మాల వేసి ఘన ని­వా­ళు­లు అర్పిం­చా­రు. అనం­త­రం ని­ర్వ­హిం­చిన సభలో ఆయన వి­స్తృ­తం­గా ప్ర­సం­గి­స్తూ, ఎన్టీ­ఆ­ర్‌ రా­జ­కీయ జీ­వి­తం, ఆయన తీ­సు­కొ­చ్చిన సం­స్క­ర­ణ­లు, సం­క్షేమ పథ­కా­లు, అలా­గే ప్ర­స్తు­తం రా­ష్ట్రం­లో తమ ప్ర­భు­త్వం అమలు చే­స్తు­న్న కా­ర్య­క్ర­మా­ల­పై సమ­గ్రం­గా మా­ట్లా­డా­రు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాకముందు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. బీసీ వర్గాలకు ఎన్టీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యత చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు చెప్పారు. “స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు.

ఎన్టీ­ఆ­ర్‌ తీ­సు­కొ­చ్చిన సం­క్షేమ కా­ర్య­క్ర­మా­ల్లో తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం­లో ప్రా­రం­భిం­చిన అన్న­దాన పథకం ఎంతో గొ­ప్ప­ద­ని చం­ద్ర­బా­బు గు­ర్తు చే­శా­రు. “తి­తి­దే­లో అన్న­దాన కా­ర్య­క్ర­మా­న్ని మొ­ద­లు­పె­ట్టిన ఘనత ఎన్టీ­ఆ­ర్‌­కే దక్కు­తుం­ది. నేడు లక్ష­లా­ది మంది భక్తు­లు అన్న­దా­నం పొం­దు­తు­న్నా­రం­టే, దా­ని­కి మూ­ల­కా­ర­ణం ఎన్టీ­ఆ­ర్‌ తీ­సు­కు­న్న ఆ ని­ర్ణ­య­మే” అని చె­ప్పా­రు. కృ­ష్ణా నది­లో మి­గు­లు జలా­ల­పై ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు హక్కు ఉం­ద­ని మొ­ద­టి­గా గళ­మె­త్తిం­ది కూడా ఎన్టీ­ఆ­ర్‌­నే­న­ని చం­ద్ర­బా­బు గు­ర్తు చే­శా­రు. “మనకూ కృ­ష్ణా జలా­ల్లో హక్కు ఉం­ద­ని ధై­ర్యం­గా చె­ప్పిన నా­య­కు­డు ఎన్టీ­ఆ­ర్‌. రా­య­ల­సీమ ప్రాం­తా­ని­కి నీ­ళ్లు ఇవ్వా­ల్సిన బా­ధ్యత తన­దే­న­ని ఆయన బహి­రం­గం­గా ప్ర­క­టిం­చా­రు. ప్రాం­తాల మధ్య సమ­తు­ల్యత కోసం ఎన్టీ­ఆ­ర్‌ చూ­పిన దూ­ర­దృ­ష్టి నే­టి­కీ మా­ర్గ­ద­ర్శ­కం­గా ని­లు­స్తోం­ది” అని వి­వ­రిం­చా­రు. త్వ­ర­లో రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 700 అన్న­క్యాం­టీ­న్ల­ను ఏర్పా­టు చే­య­ను­న్న­ట్లు సీఎం ప్ర­క­టిం­చా­రు. “పే­ద­వా­డి­కి కడు­పు­నిం­డా భో­జ­నం అం­దిం­చా­ల­న్న­దే మా లక్ష్యం. అం­దు­కే అన్న­క్యాం­టీ­న్ల సం­ఖ్య­ను భా­రీ­గా పెం­చు­తు­న్నాం” అని తె­లి­పా­రు. గృ­హ­ని­ర్మాణ రం­గం­లో ప్ర­భు­త్వం చే­ప­డు­తు­న్న కా­ర్య­క్ర­మా­ల­పై కూడా చం­ద్ర­బా­బు మా­ట్లా­డా­రు.

రౌడీయిజానికి చోటు లేదు

శాంతిభద్రతల అంశంపై చంద్రబాబు నాయుడు కఠినంగా మాట్లాడారు. “శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. నాపై దాడి జరిగినా భయపడకుండా ప్రజల భద్రత కోసం పోరాటం చేశాను. రౌడీలకు రాష్ట్రంలో చోటు లేదని స్పష్టంగా చెప్పిన పార్టీ తెలుగుదేశం” అని అన్నారు.

రాజధాని అమరావతే

రాజధాని అంశంపై చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టత ఇచ్చారు. “సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటూ కొందరు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. బెంగళూరులో లేదా ఇడుపులపాయలో ఉంటే అక్కడే రాజధాని అవుతుందా? ప్రజలు మూడు ముక్కలాటను నమ్మలేదు కాబట్టే మూడు ప్రాంతాల్లోనూ మాకు విజయం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని గర్వంగా నినదిద్దాం” అని పిలుపునిచ్చారు.

Tags

Next Story