Khammam : ఖమ్మం వరద నష్టంపై కేంద్ర బృందం అంచనా

Khammam : ఖమ్మం వరద నష్టంపై కేంద్ర బృందం అంచనా
X

ఖమ్మం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. వరదలతో నష్టపోయిన ఇళ్లను పరిశీలించారు సెంట్రల్ టీమ్ ప్రతినిధులు. బొక్కలగడ్డ, దంసలాపురంలో వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం అధికారులతో కేంద్ర బృందం సభ్యులు చెర్చించారు. మొత్తం ఆరుగురు సభ్యులు రెండు బృందాలుగా ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం, తిరుమలాయపాలెం మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితులు, రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్ కుమార్, వ్యవసాయశాఖ నుంచి శాంతినాథ్ శివప్ప ఒక బృందంగా పర్యటిస్తున్నారు. రెండో బృందంలో రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ కే కుశ్వంగ, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి టి నైల్ ఖాన్సూన్, ఎన్ఆర్​ఎస్​సీ నుంచి శశివర్ధన్ రెడ్డి మరో బృందంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బాధితుల్లో భరోసా నింపడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి. దెబ్బతిన్న పంటలను పరిశీలించాయి.

Tags

Next Story