Chakradhar Goud : 10 వేల మందికి .. ప్రమాద బీమా చేయిస్త : ​చక్రధర్​ గౌడ్​

Chakradhar Goud : 10 వేల మందికి .. ప్రమాద బీమా చేయిస్త : ​చక్రధర్​ గౌడ్​
X

ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది వేల మందికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ చక్రధర్ గౌడ్ తెలిపారు. గత ఏడాది సిద్దిపేట నియోజకవర్గంలోని గీతా కార్మికులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5 లక్షల ప్రమాద బీమా పాలసీలను చేయించానని, ఈ సంవత్సరం పది వేల మందికి పాలసీ చేయించబోతున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరం11 మంది ప్రమాదవశాత్తు చనిపోయారని, వీరిలో ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల బీమా డబ్బులు అందాయన్నారు. ఈ ఏడాది మొదటి విడతలో 5 వేల మందికి, రెండవ విడతలో 5 వేల మందికి ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే బీమా పాలసీలు చేయించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు సిద్దిపేటలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Tags

Next Story