TG : డిసెంబర్ 7న రేవంత్ మంత్రివర్గ విస్తరణకు చాన్స్.. ఆశావహులు వీరే
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం కుదిరినట్టు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 7తో రేవంత్ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఏడాది పాలనపై పెద్ద ఎత్తున సంబరాలకు కాంగ్రెస శ్రేణులు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 7 లోపే మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ ముహుర్తం ఫిక్స్ చేశారని.. హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రిపదవి కోసం చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. రంగారెడ్డి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాకు ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు. సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలి, వివేక్ వెంకటస్వామి, షబ్బీర్ అలీ, మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఆశావహుల లిస్ట్ లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com