KCR : ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో చండీయాగం.. నేటి నుంచి..

బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చేసే యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన ఆయుత చండీ యాగం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి ఎదురవుతున్న పలు ఇబ్బందుల నేపథ్యంలో ఆయన మరోసారి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో చండీ యాగం చేయనున్నారు. ఈ మేరకు యాగానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. 15 మంది రుత్వికులతో కేసీఆర్ దంపతులు ఈ యాగం క్రతువుని నిర్వహించనున్నారు. నేడు ప్రారంభం కానున్న ఈ యాగం ఈ నెల 6 వరకు జరగున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల వాతావరణం ఏర్పడడం, పలు ప్రాజెక్టులపై విచారణలు జరగడం, అలాగే ఆయన కుమారుడు , కూతురు మధ్య కూడా సఖ్యత లేకపోవడం వంటి కారణాలతోనే పండితుల సూచన మేరకు కేసీఆర్ చండీ యాగం నిర్వహిస్తున్నట్లుగా పొలిటికల్ వర్గాల్లో టాక్. ఐతే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com