TG : సినీ ఇండస్ట్రీలో మార్పు రావాలి : ఎమ్మెల్యే కూనంనేని

ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను కూనంనేని, సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి వర్గ సభ్యులు నరసింహ, ప్రజానాట్య మండలి నాయకులు కన్నం లక్ష్మినారాయణ తో కలిసి ఇవాళ పరామర్శించారు. ఈ మేరకు బాలుడి హెల్త్ కండీషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. సినిమాలలో విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతిలో మార్పు రావాలన్నారు. ' సినీ ఇండ స్త్రీ, ప్రభుత్వానికి మధ్య వివాదంగా ఈ అంశం మారింది. ఈ అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలి. సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో వివరించా రు. బౌన్సర్లు గూండాల మాదిరిగా వ్యవహరించడం మూలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ తరుఫున కోరుతున్నం. సామాజిక, సందేశాత్మక సినిమాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వదు. పోలీసు వ్యవస్థను అణచివేసే విధంగా రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు సెన్సార్ పర్మిషన్లు ఇవ్వడం నిజంగా శోచనీయం' అని కూనంనేని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com