TG : కుటుంబం కోసమే ఫార్మా స్థలం మార్పు.. కేటీఆర్ విసుర్లు

TG : కుటుంబం కోసమే ఫార్మా స్థలం మార్పు.. కేటీఆర్ విసుర్లు
X

సొంత కుటుంబానికి ప్రయోజనం కోసమే ఫార్మా ఇండస్ట్రీని మార్చుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నారని చెప్పారు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకొంటున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జైలులో ఉన్న 16 మంది లగచెర్ల రైతులను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్.. భూమి సేకరించే విషయంలో పేదలను సమిధలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్షల రూపాయల విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు.

Tags

Next Story