Telangana Medical Recruitment : మెడికల్ బోర్డు దరఖాస్తు తేదీల్లో మార్పులు...

తెలంగాణ మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 607 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఐతే దీనికి సంబంధించి దరఖాస్తు ల స్వీకరణ తేదీల్లో బోర్డు స్వల్ప మార్పులు చేసింది.
కాగా ఈ నెల 10 నుంచి 17 వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని ప్రకటించినప్పటికీ ఆ తేదీల ను మారుస్తూ మరో ప్రకటన విడుదల చేసింది మెడికల్ బోర్డు. వైద్యుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ తేదీల్లో మార్పులు చేసింది. ఈ నెల 20 నుంచి 27 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకోనున్నట్లుగా ప్రకటనను విడుదల చేసింది. అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అప్లికేషన్తో పాటు అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. అయితే, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల ధృవీకరణ, ఇతర సర్టిఫికెట్లు సమకూర్చుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో దరఖాస్తు స్వీకరణ తేదీల్లో మార్పులు చేస్తూ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com