CM Revanth Reddy : బర్త్ డే సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో సీఎం పూజలు

CM Revanth Reddy : బర్త్ డే సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో సీఎం పూజలు
X

పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మూసీ ప్రాంతంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ ఉదయం సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రాకతో యాదాద్రిలో ఏర్పాట్లను మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దగ్గరుండి ప పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న సీఎం, మంత్రులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం మంత్రులకు వేద ఆశీర్వచనం అందించారు ఆలయ పండితులు. ఆ తర్వాత అధికారిక కార్యక్రమాలు ప్రారంభించారు. వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి మూసీ పరివాహక పాదయాత్రలో భాగంగా ఆ ప్రాంత రైతులతో మాట్లాడనున్నారు. మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమ లింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శిస్తారు. అనంతరం మూసీ పరివాహ ప్రాంతం రైతులతో సమావేశం అవుతారు. మూసీ మురికి కూపంతో ఇబ్బందిపడుతున్న రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

Tags

Next Story