ఆనందయ్య మందుపై అభ్యంతరాలెందుకు: చినజీయర్ స్వామి

ఆనందయ్య మందుపై అభ్యంతరాలెందుకు: చినజీయర్ స్వామి
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వివాదాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు గురించి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి స్పందించారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిని చిన్న జీయర్ స్వామి సందర్శించారు.

ఆస్పత్రి వైద్యులు సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తున్న కరోనా మందు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఇచ్చే మందులో దుష్ప్రభావాలు ఏమీ లేవని ఆయూష్ కమిటీ నిర్ధారించిందని అన్నారు. ఉచితంగా మందు ఇస్తుంటే అభ్యంతరం ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా రోగుల ప్రాణాలు నిలబెడుతుంటే దాన్ని వివాదం చేయడం ఎందుకని అన్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వివాదాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం సహకరించాలని అన్నారు.

కాగా పలువురు తెలంగాణా నాయకులు ఆనందయ్య మందుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుంటే, మరి కొందరు నాయకులు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story