TG : కేటీఆర్ కంటే కవితే ముందు సీఎం.. సీఎం రేవంత్ హాట్ కామెంట్

TG : కేటీఆర్ కంటే కవితే ముందు సీఎం.. సీఎం రేవంత్ హాట్ కామెంట్
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహ తహలాడుతున్నారని, జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీ పర్యటనకు ముందు రేవంత్ హైదరాబాద్ లో మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. జైలుకు వెళ్లిన వారే సీఎం అయితే కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే కవిత జైలుకు వెళ్లారని, కేటీఆర్ కంటే కవితే సీఎం అవుతారన్నారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు. ఆపోటీని తట్టుకోలేక కేటీఆర్ చిల్లర ఆలోచనలతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు

Tags

Next Story