CM KCR phone : తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడంపై కేంద్రం ఫోకస్‌

CM KCR phone : తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడంపై కేంద్రం ఫోకస్‌
X
CM KCR phone : నీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న మాటల యుద్ధంపై కేంద్రం ఫోకస్‌ చేసింది.

CM KCR phone : నీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న మాటల యుద్ధంపై కేంద్రం ఫోకస్‌ చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు... కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్‌ స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్జీటీ ఆదేశాలపై చర్చించినట్లు సమాచారం. ఏపీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఈ సందర్భంగా కేసీఆర్‌ షెకావత్‌కు వివరించగా.. అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణా బోర్డు బృందాన్ని పంపిస్తామని.. పనులు జరుగుతున్నాయో.. లేదో కమిటీ పరిషీలిస్తుందని షెకావత్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

Tags

Next Story