TG : సీఎం రేవంత్.. తాలిబన్ వారసుడు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు : ప్రశాంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి తాలిబన్ వారసుడిగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. సీఎంకు మహిళలు అంటే గౌరవం లేదన్నారు. సీనియర్ ఎమ్మేల్యేలు అని కూడా చూడకుండా అవమానించారని మండిపడ్డారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహిళా ఎమ్మెల్యే 4 గంటలు అడిగినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే దమ్ము రేవంత్ లేదన్నారు. దేశంలో 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. రేవంత్.. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని ఫైర్ అయ్యారు.
సీఎం అపరిచితుడిలా వ్యవహరిస్తుండు
‘సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చేప్పాలి. రేవంత్ మాటలకు సబిత కన్నీటిపర్యంతమయ్యారు. సభలో మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నిరసన చేశాం. కానీ సీఎం కనుసైగల్లో స్పీకర్ పని చేస్తున్నారు. నిరసన తెల్పుతున్న మమ్మల్ని కిరాతకంగా మార్షల్స్‌తో అరెస్ట్ చేశారు. రేవంత్ అహంకారంగా, అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు.’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com