TG : సీఎం రేవంత్ కీలక ప్రకటన.. వారికి రూ.కోటి పరిహారం

TG : సీఎం రేవంత్ కీలక ప్రకటన.. వారికి రూ.కోటి పరిహారం
X

పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో IPSలు మరణిస్తే రూ.2 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ మరణిస్తే రూ.1.5 కోట్లు, ఎస్సై, సీఐ మరణిస్తే రూ.1.25 కోట్లు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు మరణిస్తే రూ.కోటి పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. శాశ్వత వైకల్యం పొందిన అధికారుల ర్యాంక్‌ను బట్టి పరిహారం ఇస్తామని చెప్పారు.

ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. గోషామహల్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.

Tags

Next Story