CM REVANTH: సాహసబాలుడు సాయిచరణ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సన్మానం

రంగారెడ్డి జిల్లా నందిగామలో రెండు రోజుల క్రితం అలెన్ హోమియో అండ్ హెర్బల్స్ ఫార్మాలో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కాపాడిని సాయిచరణ్ అనే బాలుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. పొగ, చిన్న చిన్నగా మంటలు రావడం గమనించి ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన 17 ఏళ్ల సాయిచరణ్, అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టి భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు.
కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్ సాయం చేశాడు. ఆరుగురు కార్మికులను కాపాడాడు. మరికొంత మందిని అప్రమత్తం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సైతం సాయి చరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సాయిచరణ్ సాహసానికి సంబంధించిన సమాచారం తెలంగాణకు సీఎంవోకు కూడా చేరింది. విషయం తెలుసుకున్న సీఎం రేంత్ రెడ్డి, తన కార్యాలయానికి పిలిచి ఎమ్మెల్యే సమక్షంలో సాయిచరణ్‌ను అభినందించి సత్కరించారు. బాలుడి తల్లిదండ్రులతోనూ రేవంత్ మాట్లాడారు. కార్మికులను కాపాడడంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను రేవంత్ రెడ్డి బాలుడు సాయిచరణ్ ను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్యసాహసాల పట్ల సీఎం ముగ్ధుడయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com