CM Revanth : ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష

CM Revanth : ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష
X

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించ జరుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్నందున, డిఫెన్స్ విభాగాలకు స్థావరంగా ఉన్నందున తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్ని విభాగాలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు,ఇతర నేతలు హాజరు కానున్నారు.అలాగే ఈ రోజు సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు.

Tags

Next Story