TG : సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మొదటి పంప్‌హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ కాసేపట్లో వైరాలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com