CM Revanth : మద్యం తాగడంపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్`

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన అలవాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నప్పటి నుంచి మద్యం సేవించాలనే కోరిక ఏనాడూ కలగలేదని .. తన పెంపకం, సామాజిక బాధ్యతలే అందుకు కారణమని తెలిపారు. సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా, నలుగురికీ ఆదర్శంగా ఉండాలని భావించినప్పుడు మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను" అని ఆయన వివరించారు.
హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిని ఒక 'ఐకాన్'గా అభివర్ణించారు. ముఖ్యమంత్రికి సిగరెట్, మద్యం సేవించడం వంటి ఎలాంటి దురలవాట్లు లేవని, ఆయనకు ఫుట్‌బాల్ అంటే మాత్రమే ఇష్టమని కొనియాడారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి తనకు మద్యం అలవాటు ఎందుకు లేదో చెప్పుకొచ్చారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com