TG : సీఎం రేవంత్ పుట్బాల్ ప్లేయర్.. ఎప్పుడు గోల్ కొట్టాలో తెలుసు : ఎమ్మెల్యే గణేష్

TG : సీఎం రేవంత్ పుట్బాల్ ప్లేయర్.. ఎప్పుడు గోల్ కొట్టాలో తెలుసు : ఎమ్మెల్యే గణేష్
X

హైడ్రాతో నగరంలోని ఆక్రమణలను తొలగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జంట నగరాల ప్రజలు అండగా ఉంటారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా పలు మెట్రో సిటీల్లో వరదలు వచ్చాక పరిస్థితిని చూశామని, అలాంటి పరిస్థితులు హైదరాబాద్ కు రాకూడదనే సీఎం హైడ్రా ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటి వరకు సక్సెస్ పుల్ గా కొనసాగుతుందన్నారు. మెజార్టీ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం దాన్ని కూడా రాజకీయం చేస్తుందన్నారు. నగరాన్ని తామే నిర్మించామని అనే స్థాయిలో పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు నిద్రపోయి, ఇప్పుడు కేటీఆర్ డ్రామాలు ఆడితే ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. నగరాన్ని ధ్వంసం చేసి నాటకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా సీఎం రేవంత్ రెడ్డి పుట్ బాట్ ప్లేయర్.. ఆట ఎలా ఆడాలో.. గోల్ ఎప్పుడు కొట్టాలో తెలుసు.. బీఆర్ఎస్ పని ఇక ఖతం.. ప్రజలు ఆ పార్టిని నమ్మే పరిస్థితులో లేరు’ అని ఎమ్మెల్యే పంచ్ డైలాగ్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ప్రశాంతమైన సిటీ అందుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఆక్రమదారుల గుండెల్లో హైడ్రా నిద్రపోతుందన్నారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ను తీసుకువెళ్లడం సీఎం రేవంత్ కు సాధ్యమవుతుందని అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో అన్ని రంగాలు డెవలప్ అయ్యేలా ప్రణాళిక చేస్తున్నామని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు.

Tags

Next Story