CM Revanth : జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

వరదలతో పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకి పదివేల రూపాయల సాయం అందిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి గల కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై బ్లూబుక్‌ను తయారు చేసుకోవాలన్నారు.
జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థను తయారు చేయాలని వాటిని కలెక్టరేట్‌లో ఉంచాలన్నారు. చెరువులను ఆక్రమించడం క్షమించరాని నేరమన్నారు. మహబూబాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించారు. జిల్లాలో 28 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారన్నారు. అయినా నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులకు సాయం కోసం ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com