CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్

రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మిస్తామని, ఎవరైనా వచ్చి చూడొచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సెక్ర టేరియట్ లో ఆయన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన యాప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యా ప్తంగా తొలిదశలో 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేసినట్టు చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఇండ్ల
మోడల్ ను కూడా సీఎం ఆవి ష్కరించారు. రాష్ట్రంలో గుడిలేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని అన్నారు. రూ. 10 వేల సాయంతో మొదలైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇప్పుడు రూ.5 లక్షలకు చేరిందని అన్నారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ ద్వారా శుక్రవా రం నుంచి లబ్ధిదారుల నమోదు చేయనున్నామని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని వివరిం చారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. గ్రామసభల్లో ఇం దిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నామని వివ రించారు. అర్హుల జాబితాను కేం ద్రానికి పంపుతామని అప్రూవల్ వచ్చాకే నిర్మాణం చేపడుతామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com