CM Revanth : నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

CM Revanth : నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
X

సీఎం రేవంత్ ఇవాళ మ.3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 4న తెలంగాణ కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు ఆమోద ముద్ర వేశారు. రైతు భరోసా వ్యవసాయయోగ్యమైన భూములకు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ పథకం అమలు తీరుపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే 26 తేదీ నుంచి అమలు చేయనున్న రైతుభరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ, భూమి లేని వ్యవసాయ రైతు కూలీల కుటుంబాలను గుర్తించడం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

Tags

Next Story