CM Revanth : నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన: సీఎం రేవంత్

CM Revanth : నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన: సీఎం రేవంత్
X

ఈ నెలాఖరులోగా హైదరాబాద్ లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణంపై సమీక్షించిన ఆయన, భూ బదలాయింపుతో సహా ఇతర పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్‌లను అధికారులు వివరించగా, సీఎం పలు మార్పులు సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నమూనాలను రూపొందించాలన్నారు.

అధికారులు వివరించిన మ్యాప్‌లలో ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలన్నారు.

Tags

Next Story