TG : సౌత్ సీఎంలతో నిరసనకు సీఎం రేవంత్ ప్లాన్

TG : సౌత్ సీఎంలతో నిరసనకు సీఎం రేవంత్ ప్లాన్
X

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర వైఖరికి నిరసనగా హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్య మంత్రుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించానని, కేరళ, పాండిచ్చేరి, ఏపీ ముఖ్యమంత్రులతో కూడి మాట్లాడి వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తానని చెప్పారు.

ఈ భేటీకి వచ్చేది లేనిది ఆ ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం రాక తప్పదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags

Next Story