CM Revanth Ready : ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై చర్చకు సిద్ధం: సీఎం రేవంత్

CM Revanth Ready : ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై చర్చకు సిద్ధం: సీఎం రేవంత్
X

ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై అసెంబ్లీలో చర్చించాలన్న కేటీఆర్ డిమాండ్‌పై సీఎం రేవంత్ స్పందించారు. ‘ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేం ప్రమాణ స్వీకారం చేసినప్పుడే FEO కంపెనీ ప్రతినిధులు నన్ను కలిశారు. కేటీఆర్ తో చీకటి ఒప్పందం ఉందని మాకు చెప్పారు. మేము కూడా సహకరించాలని కోరారు. అప్పుడే మాకు ఈ స్కామ్ గురించి తెలిసింది. ఇది మొత్తం రూ.600 కోట్ల స్కామ్ అయ్యేది. ప్రభుత్వం మారడంతో రూ.55 కోట్లతో ఆగిపోయింది’ అని చెప్పారు.

ధరణి పోర్టల్‌తో రైతుల సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘గాదె శ్రీధర్ రాజు ద్వారా డేటాను విదేశాలకు పంపించారు. వాళ్లు ఒక్క క్లిక్ కొడితే మన సమాచారమంతా నాశనం అవుతుంది. ఇక్కడి సర్వర్లు క్రాష్ అవుతాయి. అందుకే మేం అధికారంలోకి రాగానే ఎంతో మంది నిపుణులు, మేధావులు, రైతునేతలతో చర్చించి ధరణిని రద్దు చేశాం’ అని సీఎం వెల్లడించారు.

తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేదే భూమి అని సీఎం రేవంత్ అన్నారు. భూభారతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడారు. ‘భూమిలేని పేదలకు ఇందిరా సర్కార్ భూమిచ్చింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం అన్నదాతలను తమ భూములకు దూరం చేసింది. యువరాజు(కేటీఆర్ )కు అత్యంత సన్నిహితులైన వారికి దీని పోర్టల్‌ను అప్పగించారు’ అని ఆరోపించారు.

Tags

Next Story