TG : ఒకే వేదికపై సీఎం రేవంత్, కేటీఆర్!

X
By - Manikanta |18 Sept 2024 11:45 AM IST
రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకోనుంది. నిత్యం ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఈనెల 21న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కేటీఆర్ కు ఆహ్వానం పంపామని, వారు పాల్గొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆగస్ట్ 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఏచూరి చికిత్సం పొందుతూ సెప్టెంబర్ 12న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com