CM Revanth Reddy : పెద్దన్నగా అండగా ఉంటా.. యువతకు సీఎం రేవంత్ భరోసా

CM Revanth Reddy : పెద్దన్నగా అండగా ఉంటా.. యువతకు సీఎం రేవంత్ భరోసా
X

అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ తెలిపారు. ‘TGPSCని ప్రక్షాళన చేసి గ్రూప్-1 ప్రిలిమినరీ, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి DSC నిర్వహించాం. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మేం పరిష్కరిస్తాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. పెద్దన్నగా మీకు అండగా ఉంటా’ అని యువతకు హామీ ఇచ్చారు. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రకటించారు. ఇక అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం సానుకూలంగా సాగిందని తెలిపారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయమని సీఎం వెల్లడించారు. రైతు రుణమాఫీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పథకానికి అర్హులైన వారందరికీ రుణమాఫీ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఎవరికైనా సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాకపోతే చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. రుణమాఫీ వల్ల తమ జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు.

Tags

Next Story