కాళేశ్వరం సందర్శనకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని సీఎం రేవంత్ నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) సందర్శనకు 119 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను (KCR) ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌కు అప్పగించారు సీఎం రేవంత్. ఇప్పటికే సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించింది ప్రభుత్వం.
కాసేపట్లో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. ఇప్పటికే అసెంబ్లీ వద్దకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. 13వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను 12వ తేదీనే ముగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు 13వ తేదీనే నల్గొండలో బీఆర్ఎస్ సభ ఉండటంతో కేసీఆర్ రాకపై ఆసక్తి నెలకొంది. నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి కేటీఆర్ దూరంగా ఉండనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ ఉండటంతో ఆ సభకు కేటీఆర్, తలసాని హాజరుకానున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌కు వెళ్లి.. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ప్రత్యేక భేటీ కానున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో, శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం సుమారు రూ. 3 కోట్ల బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని అర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com